శ్రీలంకలో ఉద్రిక్తత.. ఎంపీని చంపిన ఆందోళనకారులు..

-

ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక కొట్టు మిట్టాడుతోంది.. రోజు రోజుకు శ్రీలంకలో పరిస్థితులు విషమిస్తున్నాయి. అయితే తాజాగా ఆందోళనకారులతో జరిగిన ఘర్షణల్లో అధికార పార్టీ ఎంపీ మరణించడం.. ప్రజాపాలనపై ప్రభుత్వం అదుపు కోల్పోతోందనడానికి నిదర్శనం ఈ ఘటన. కొలంబో రాజధాని వెలుపల నిట్టంబువా ప్రాంతంలో ఆందోళనకారులు భారీ ఎత్తున గుమికూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ సమయంలో ఎంపీ అమరకీర్తి అతుకోరల తన కారులో అక్కడికి వచ్చారు. ఎంపీని చూడగానే ఆగ్రహంతో ఆందోళనకారులు ఆయన కారును చుట్టుముట్టారు. దాంతో ఎంపీ తుపాకీ తీసి కాల్పులు జరిపారు.

Sri Lanka: శ్రీలంకలో తీవ్రరూపం దాల్చుతున్న నిరసనలు.. అల్లర్లలో అధికార  పార్టీ ఎంపీ మృతి | An MP from the ruling party has been killed in protest  at Sri Lanka | TV9 Telugu

ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆందోళనకారుల నుంచి తప్పించుకుని సమీపంలోని భవనంలో ఆశ్రయం పొందేందుకు ఎంపీ అమరకీర్తి ప్రయత్నించారు. కాసేపటి తర్వాత ఆయన శవమై కనిపించడం గమనార్హం. శ్రీలంకలో సంక్షోభం మొదలయ్యాక, కొలంబోలో నేడు అత్యంత తీవ్రస్థాయిలో హింస చెలరేగింది. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు ప్రయోగించాల్సి వచ్చింది. తక్షణమే కొలంబోలో కర్ఫ్యూ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news