ఏపీ సీఐడీ పోలీసులకు ఎంపీ రఘురామ బహిరంగ లేఖ

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఐడీ పోలీసులకు నర్సాపురం వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖ రాశారు. ఇటీవలే రఘరామ కృష్ణం రాజుకు ఏపీ సీఐడీ పోలీసులు ఇచ్చిన నోటీసుల నేపథ్యంలోనే.. ఆయన సమాధానంగా లేఖ రాశారు. ‘‘తన అనారోగ్యం వల్ల విచారణకు హాజరుకాలేను. దిల్లీ వెళ్లాక అనారోగ్యానికి గురయ్యాను. విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలి’’ అని సీఐడీ పోలీసులకు రాసిన లేఖలో వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కోరారు.

కాగా ఈ రోజు సీఐడీ విచారణకు రఘురామ హాజరు కావాల్సి ఉంది. కాగా.. గత వారం రోజుల కింద ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఐడీ పోలీసులు.. వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 17 వ తేదీన అంటే ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఐడీ పోలీసులు. ఇది ఇలా ఉండగా.. ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కొన్ని రోజుల ముందు సీఐడీ అధికారులు రఘురామకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news