మంత్రి పెద్దిరెడ్డిని మంత్రిగా తొలగించాలి: ఎంపీ రామ్మోహన్ నాయుడు

-

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక పుంగనూరు లో తాజాగా చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ కార్యకర్తలు సైకిల్ యాత్రను చేశారు. కానీ పుంగనూరు ఎమ్మెల్యే మరియు ప్రస్తుతం మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ యాత్రను అడ్డుకుని కార్యకర్తలను అవమానపరిచాడని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పుంగనూరులో టీడీపీ నేతల చొక్కాలను విప్పించారు మంత్రి పెద్దిరెడ్డి, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని వెంటనే మంత్రి పదవి నుండి తొలగించాలి అంటూ డిమాండ్ చేశారు. పుంగనూరులో యాత్రలు చేయకూడదా ? ఇక్కడ ఏమైనా స్పెషల్ గా పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తోందా అంటూ మంత్రిపై ఫైర్ అయ్యారు రామ్మోహన్ నాయుడు.

మరీ ఇంత అరాచకమా ? త్వరలోనే వైసీపీకి బుద్ది చెప్పే రోజు వస్తుందంటూ రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version