మహిళను దారుణంగా కొట్టిన బుచ్చయ్య చౌదరి..ఫోటో వైరల్ !!

-

ఓ మహిళను టీడీపీ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్‌ నాయకులు బుచ్చయ్య చౌదరి దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్‌ గా మారింది. అయితే.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో.. తెలీదు కానీ.. విజయసాయిరెడ్డి ఈ ఫోటోను ట్యాగ్‌ చేసి.. ట్వీట్‌ చేశారు.

“ఒరేయ్ బుచ్చిగా! మహిళ అని చూడకుండా అభాగ్యురాలిని ఈడ్చి కొట్టావు. వయసుకు తగ్గ హుందాతనం నీ పత్తిగింజ బతుకులో ఏనాడైనా చూపించావా? ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుపడితే పేదలు తరిమికొట్టింది నువ్వు మర్చినట్టు నటించినా, అందరికీ గుర్తుంది?” ఓ రేంజ్‌ లో బుచ్చయ్య చౌదరిపై నిప్పులు చెరిగారు సాయిరెడ్డి.

మద్యం బ్రాండ్లలో విషం ఉందని దొంగ రిపోర్టు సృష్టించాడు నారా నీచుడని.. తాము టెస్టులే చేయలేదని SGS ల్యాబ్ చెప్పుతో కొట్టిందని గుర్తు చేశారు. పాయిజన్ అయింది తెలుగు దొంగల పార్టీ బుర్రలు, ఈర్ష్య ఆలోచనలు. బెల్టు షాపులు నడిపించిన రోజుల్లో కల్తీ సరుకు అమ్మించాడు అల్జీమర్స్. ఇప్పుడా స్కోపే లేదు మెంటల్ అంటూ మరో ట్వీట్‌ లో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news