ఆంధ్రప్రదేశ్ లో ప్రాధమిక హక్కులు కాలరాస్తున్నారని.. ప్రతిపక్ష నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు. అయితే తాజాగా ఈ విషయమై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు.
‘మనవాళ్లు బ్రీఫుడు మీ’ అన్న వాయిస్ మీదేనని పసిపిల్లలూ గుర్తుపట్టారు. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఎవరిచ్చారని మీడియా ఇంటర్వ్యూల్లో గద్దించిన సంగతి ఎవరూ మర్చి పోలేదు. ఇజ్రాయిల్ ట్యాపింగ్ మిషన్ల కోసం కింద మీదా పడ్డట్టు వికీలీక్స్ బయట పెట్టింది. దొంగే దొంగని అర్చినట్టు లేదూ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 18, 2020
“మనవాళ్లు బ్రీఫుడు మీ” అన్న వాయిస్ మీదేనని పసిపిల్లలూ గుర్తుపట్టారు. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఎవరిచ్చారని మీడియా ఇంటర్వ్యూల్లో గద్దించిన సంగతి ఎవరూ మర్చి పోలేదు. ఇజ్రాయిల్ ట్యాపింగ్ మిషన్ల కోసం కింద మీదా పడ్డట్టు వికీలీక్స్ బయట పెట్టింది. దొంగే దొంగని అర్చినట్టు లేదూ?” అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఇప్పటికే చంద్రబాబు చేసిన ఈ ఆరోపణలపై హోమ్ మంత్రి సుచరిత స్పందించిన సంగతి తెలిసిందే.