అటార్నీ జనరల్‌గా మరోసారి ముకుల్‌ రోహత్గి..!

-

మరోసారి అటార్నీ జనరల్‌(ఏజీ)గా సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్‌ రిటైర్మెంట్‌ తర్వాత రోహత్గి ఈ బాధ్యతలను చేపట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో ఏజీగా పనిచేసిన రోహత్గి 2017లో ఈ బాధ్యతల నుంచి వైదొలగడంతో 15వ అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌ను నాడు ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఏజీ వేణుగోపాల్‌ పదవీకాలాన్ని పొడగించారు. అది కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. ఆయన ఈ పదవిలో దాదాపు 5ఏళ్లుగా కొనసాగుతున్నారు.

2020లోనే వేణుగోపాల్‌ మూడేళ్ల పదవీకాలం ముగిసింది. అప్పటికే ఆయన వయస్సు దాదాపు 89 ఏళ్లు. తన వయస్సును దృష్టిలో పెట్టుకొని విశ్రాంతిని ఇవ్వాలని అప్పట్లో వేణుగోపాల్‌ కేంద్రాన్ని కోరారు. కానీ, కేంద్రం ఆయన్ను మరో మూడేళ్లపాటు పదవిలో కొనసాగమని అభ్యర్థించడంతో ఆయన కొనసాగారు. ముకుల్‌ రోహత్గి పదవీకాలం అక్టోబర్‌ 1 నుంచి మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news