ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో టాప్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ముంబై బిగ్ షాక్ ఇచ్చింది. ఆఖరి వరకూ ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో ముంబై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. సాహా, శుభమన్ గిల్ రాణించారు.
ముంబయి బౌలర్లలో మురుగన్ అశ్విన్ రెండు, పొలార్డ్ ఒక వికెట్ తీశారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఆరంభం నుంచి ధాటిగా ఆడింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ శుభారంభం అంధించడంత వల్ల నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ రాణించారు. చివర్లో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య కుమార్ యాదవ్ 13, తిలక్ వర్మ 21, పొలార్డ్ 4 పరుగులతో నిరాశ పరిచారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్ల పడగొట్టగా.. ఫెర్గూసన్, జోసెఫ్, సాంగ్వాన్ తలో వికెట్ తీశారు.