ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఏప్రిల్ 30న వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌ను ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ప్రస్తుత సీజన్‌లో వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు ఓడిన ముంబై, తమ 9వ మ్యాచ్‌లో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం లభించింది. ఇన్ ఫామ్ బ్యాటర్ జోస్ బట్లర్ (67) మరో హాఫ్ సెంచరీతో మెరవడంతో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
ఆఖరి ఓవర్లో ముంబై పేసర్ మెరిడిత్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి అశ్విన్ (21) వికెట్ పడగొట్టాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో బట్లర్, అశ్విన్ మినహాయించి ఎవ్వరూ రాణించలేదు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులకే ఔట్ అయ్యి పెవిలియన్ చేరాడు. అయితే రాజస్థాన్ నిర్ధేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. మరో 4 బంతులు మిగిలి ఉండగా 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.