నుపుర్ శర్మ కోసం గాలిస్తున్న ముంబై పోలీసులు

-

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ కనిపించడం లేదు. గత ఐదు రోజులుగా ముంబై పోలీసులు ఢిల్లీలో ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయినా ఆమె జాడ కనిపించడం లేదు. కాగా, మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా పలు ముస్లిం సంస్థలు భారత్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాయి.

నుపుర్ శర్మ
నుపుర్ శర్మ

ఈ క్రమంలో ముస్లిం సంస్థ అయిన రజా అకాడమీ సంయుక్త కార్యదర్శి ఇర్ఫాన్ షేక్ ఆరోపించారు. ఈ మేరకు నుపుర్ శర్మపై ముంబై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మే 29వ తేదీన ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఆమె రికార్డు స్టేట్‌మెంట్ కోసం జూన్ 25వ తేదీన హాజరుకావాలని ఈ నెల 11 తేదీన సమన్లు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆమెకు నోటీసులు అందజేసేందుకు ముంబై పోలీసుల బృందం ఢిల్లీకి వచ్చింది.

అయితే నుపుర్ శర్మ నివాసం వద్ద ఆమె ఆచూకీ లేదు. దీంతో ఐదు రోజులుగా ఢిల్లీలో ముంబై పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. కాగా, నుపుర్ శర్మపై ముంబై, ఢిల్లీ, కోల్‌కతా తదితర నగరాల్లో కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news