తెలంగానం : ఫ్లెక్సీ రాజ‌కీయం ఎందుకు కేసీఆర్ ? ఏమొస్తది !

-

జాతీయ స్థాయిలో సొంత పార్టీ ఏర్పాటు ఎలా ఉన్నా ఉన్న పార్టీల‌తో త‌గాదాలు మాత్రం తీర‌డం లేదు. దీంతో త‌రుచూ వివాదాలొస్తున్నాయి. తాజాగా బీజేపీకి కౌంట‌ర్లు ఇచ్చేందుకు అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితి త‌న‌దైన శైలిలో ప్ర‌ధానికి కౌంట‌ర్లు ఇవ్వాల‌ని చూస్తోంది. అయితే ఇదే స‌మ‌యాన వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రితో క‌లిసి పోటీ చేయాల‌న్న ఆలోచ‌న‌ల‌కూ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ దశ‌లో ఇప్ప‌టి నుంచే ప్ర‌త్య‌క్ష పోరుకు మరింత స‌న్న‌ద్ధం అవుతూనే, వీలున్నంత వ‌ర‌కూ మోడీ వైఫ‌ల్యాల‌ను వివ‌రించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీకి గ‌ట్టిపోటీనే ఇవ్వాల‌ని చూస్తోంది టీఆర్ఎస్. క‌నుక ఫ్లెక్సీ వివాదం అన్న‌ది వ‌స్తుందా లేదా జ‌స్ట్ ఇదొక పొలిటిక‌ల్ స్టంట్ గా ఉండిపోనుందా?

ఫ‌స్ట్ కాజ్ : పాలక బీజేపీ పై పాల‌క కేసీఆర్ విస్తృత స్థాయిలో పోరుకు సిద్ధం అవుతూ ఉంది. ఇందులో భాగంగా విభ‌జ‌న చ‌ట్టం అమ‌లులో ఉన్న వైఫ‌ల్యాల‌ను వివ‌రించేందుకు ఊరూ వాడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి త‌ద్వారా నిర‌స‌న తెలియ‌జేయాల‌ని, ఆ విధంగా వెర్బ‌ల్ అటాక్-ను తీవ్ర‌త‌రం చేయాల‌ని కూడా భావిస్తోంది.

వాస్తవానికి విభ‌జ‌న చ‌ట్టం వైఫ‌ల్యాల గురించి ఇప్పుడిప్పుడే కొంచెం తీవ్ర స్థాయిలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. అయితే బీజేపీ అధినాయ‌క‌త్వం మాత్రం త‌న‌దైన‌శైలిలో కేసీఆర్ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతూ, రాష్ట్రానికి తామేం చేశామో తెలియజెప్పేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పుడు కేసీఆర్ వైపు ఎవ్వరున్నా కూడా బీజేపీ చెప్పే మాటలు పెడ‌చెవిన పెట్టేందుకు వీల్లేదు. తెలంగాణ ఏర్పాట‌యి ఎనిమిదేళ్లు కావ‌స్తున్నా ఇప్ప‌టిదాకా పెద్ద‌గా కేసీఆర్ స్పందించిన దాఖ‌లాలు లేవు. ప్రాంత స‌మ‌స్య‌ల‌కు, ప్రాంతీయ హ‌క్కుల‌కు మ‌ధ్య ఉన్న సంబంధాన్ని లేదా విభేదాన్ని దేనిని ఓ దానిని త‌న‌కు అనుగుణంగా మ‌లుచుకునేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నా ర‌న్న వాద‌న అయితే ఉంది.

ఇక కేసీఆర్ కూడా జోరు పెంచి బీజేపీ పై యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. అయితే ఇటీవ‌ల కేసీఆర్ స్టాండ్ మారిపోయింద‌ని అంటున్నారు కొంద‌రు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు గురువారం (జూన్ 16, 2022) నిర్వ‌హించిన రాజ్ భ‌వ‌న్ ముట్ట‌డిని అదుపు చేయ‌డంలో కూడా విఫ‌లం అయింది కూడా కేవ‌లం వ్యూహంలోభాగ‌మేన‌ని కొంద‌రు సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నారు. క‌నుక బీజేపీని కాద‌నుకున్నాక కాంగ్రెస్-కు చేరువ అయి కాస్తో కూస్తో దేశ రాజ‌కీయాల్లో ఉనికి చాటుకోవాల‌నుకోవడం కూడా త‌ప్పేం కాదు.

ఇక వ‌చ్చే నెల‌లో బీజేపీ జాతీయ స్థాయి స‌మావేశాలున్నాయి. అందుకే వీలున్నంత వ‌ర‌కూ కేసీఆర్ త‌న‌దైన శైలిలో బీజేపీకి కౌంట‌ర్లు ఇచ్చేందుకే ఇష్ట‌ప‌డుతున్నారు. ఆ విధంగా ఆయ‌న ఎన్నిక‌ల స్ట్రాట‌జీని అమ‌లు చేస్తున్నారు కూడా! రాష్ట్రానికి రావాల్సిన నిధుల విష‌య‌మై కేంద్రం చేస్తున్న నిర్ల‌క్ష్యంపై కూడా ఫెక్సీలు వేయ‌నున్నారు అని తెలుస్తోంది. వీలున్నంత వ‌ర‌కూ వీటిని గ్రామ స్థాయిలోకి తీసుకునివెళ్లి, కేసీఆర్ ఇంత‌కుముందు త‌న‌కు తాను ద‌క్కించుకున్న పొలిటిక‌ల్ మైలేజ్ ను మ‌ళ్లీ పొందేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news