కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై ముంబై ఇండియ‌న్స్ ఘ‌న విజ‌యం

-

అబుధాబిలో బుధ‌వారం జ‌రిగిన ఐపీఎల్ 5వ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై ముంబై ఇండియ‌న్స్ ఘ‌న విజ‌యం సాధించింది. కోల్‌క‌తాపై ముంబై 49 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ముంబై విధించిన‌ 196 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో కోల్‌క‌తా త‌డ‌బ‌డింది. ఎప్ప‌టిక‌ప్పుడు ఆ జ‌ట్టు వికెట్ల‌ను కోల్పోతూ వ‌చ్చింది. దీంతో ముంబై సునాయాసంగా విజ‌యం సాధించింది.

mumbai won by 49 runs against kolkata in ipl 2020 5th match

మ్యాచ్‌లో ముందుగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా ముంబై బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్ర‌మంలో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ముంబై 5 వికెట్ల న‌ష్టానికి 195 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (80 ప‌రుగులు, 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), సూర్య‌కుమార్ యాద‌వ్ (47 ప‌రుగులు, 6 ఫోర్లు, 1 సిక్స‌ర్‌)లు రాణించారు. దీంతో ముంబై భారీ స్కోరు చేయ‌గ‌లిగింది. ఇక కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో శివం మావికి 2 వికెట్లు ద‌క్క‌గా, సునీల్ న‌రైన్‌, ఆండ్రూ ర‌స్సెల్‌లు చెరొక వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌క‌తా 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 146 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో ప్యాట్ క‌మిన్స్ (33 ప‌రుగులు, 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు), కెప్టెన్ కార్తీక్ (30 ప‌రుగులు, 5 ఫోర్లు)లు మాత్ర‌మే ఫ‌ర్వాలేద‌నిపించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ ఆక‌ట్టుకునే ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. ముంబై బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్‌, ప్యాటిన్‌స‌న్‌, బుమ్రా, చాహ‌ర్‌లు త‌లా 2 వికెట్లు తీశారు. పొల్లార్డ్‌కు 1 వికెట్ ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Latest news