మునుగోడు లేటెస్ట్ సర్వే: మండలాల వారీగా మెజారిటీ..!

-

తెలంగాణ రాజకీయాలు మొత్తం మునుగోడు ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఉపఎన్నికని అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఇక్కడ గెలిచి..పట్టు దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఇదే క్రమంలో గెలుపోటములపై ఎవరికి వారు సర్వేలు చేయించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఒక ఇండిపెండెంట్ సంస్థ చేసిన సర్వే ఒకటి బయటకొచ్చింది. దీనిలో ఏ మండలంలో ఎవరికి మెజారిటీ అనేది క్లియర్ గా చెప్పారు.

మునుగోడులో మొత్తం 2.25 లక్షల ఓటర్లు వరకు ఉన్నారు..అందులో బీసీ ఓట్లు దాదాపు లక్షా పది వేల పైనే ఉన్నాయి..తర్వాత ఎస్సీ, ఎస్టీ ఓట్లు ఎక్కువగా ఉండగా, రెడ్డి వర్గం ఓట్లు 40 వేల వరకు ఉన్నాయి. అయితే ఇక్కడ బీసీలే గెలుపోటములని తారుమారు చేయగలరు. అందుకే అందరూ బీసీల ఓట్లు దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక ఇక్కడ ఆరు మండలాలు ఉన్నాయి…చౌటుప్పల్, నారాయణపురం, మునుగోడు, మర్రిగూడ, చండూరు, నాంపల్లి మండలాలు ఉన్నాయి.

ఇక మండలాల వారీగా సర్వే బట్టి చూసుకుంటే..చౌటుప్పల్‌లో టీఆర్ఎస్-బీజేపీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని తెలిసింది. ఇటు నారాయణపురంకు వస్తే ఇక్కడ టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య పోరు ఉందట. మునుగోడులో టీఆర్ఎస్‌కు ఎడ్జ్ ఉందట..ఇక కాంగ్రెస్ సెకండ్ ప్లేస్‌లో, బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉందని తెలుస్తోంది. అటు చండూరులో కూడా టీఆర్ఎస్‌కు ఎడ్జ్ ఉండగా, నెక్స్ట్ కాంగ్రెస్ ఉందట..అటు నాంపల్లికి వస్తే ఇక్కడ కాంగ్రెస్‌కు కాస్త ఎడ్జ్ ఉందని, నెక్స్ట్ టీఆర్ఎస్ ఉందని సర్వేలో తేలింది. మర్రిగూడలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ ఉందట.

ఓవరాల్ గా వస్తే మునుగోడులో టీఆర్ఎస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయని..దాదాపు 15 వేల ఓట్ల మెజారిటీ టీఆర్ఎస్‌కు ఉందని అంటున్నారు. ఇక సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉందని, థర్డ్ ప్లేస్ లో బీజేపీ ఉందని అంటున్నారు. ఎన్నికల నాటికి సెకండ్, థర్డ్ ప్లేస్‌లు మారే ఛాన్స్ ఉందని, కానీ గెలుపు టీఆర్ఎస్ వైపే ఉంటుందని ఆ సర్వేలో తేలింది. మరి చూడాలి చివరికి మునుగోడు ప్రజలు ఎవరి వైపు ఉంటారో.

Read more RELATED
Recommended to you

Latest news