పండ్లను తినడానికి నియమాలు.. పాటిస్తే మ‌రింత‌ మేలు

-

మీరు తీసుకునే ఆహారంలో పండ్లను భాగం చేసుకోవడం తప్పనిసరి చేసుకోవాలి. పండ్లలో ఉండే పోషకాలు శరీరానికి పోషణ అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇంకా అనేక ప్రయోజనాలను కలగజేస్తాయి. ఐతే పండ్లను ఆహారంగా తీసుకునే విషయంలో చాలామంది తప్పులు చేస్తుంటారు. వాటిని ఒక క్రమపద్దతిలో కాకుండా ఇష్టం వచ్చినట్టుగా తినడం వల్ల దాని నుండి అందాల్సిన పోషకాలు అందకుండా పోతాయి. పండ్లను తినడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు పాటిస్తే పండ్ల నుండి వచ్చే పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయి.

పోషకాహార నిపుణుల ప్రకారం పండ్లను తినడానికి నియమాలు

మొదటగా, ఏ పండు అయినా సరే ఇతర పండ్లతో పాటు తినకూడదు. చాలామంది చేసే తప్పు ఇదే. చాలారకాల పండ్లని పాత్రలో వేసుకుని ఆరగిస్తుంటారు. కానీ అలా కాకుండా తిన్న ప్రతీసారి ఒకే రకమైన పండుని ఆరగించడం మంచిది.

పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గానీ, మధ్యాహ్నాం లంచ్ లోగానీ రాత్రి డిన్నర్ లోగానీ తినవచ్చు. దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొన్ని పండ్లను పొట్టు తీయకుండా తినాలి. ఉదాహరణకి ఆపిల్ పై పొట్టు తీసేయడం చాలా పోషకాలు నేలపాలు చేసిన వారవుతారు. అలాగే ద్రాక్ష, నారింజ మొదలగునవి ఇందులోకి వస్తాయి.

పండ్ల అనగానే జ్యూస్ గుర్తుకు వస్తుంది. కానీ, పండ్లను జ్యూస్ చేసుకుని తాగడం కంటే డైరెక్టుగా తినడమే ఉత్తమం. ఉదాహరణకి మామిడి పండుని జ్యూస్ చేసుకుని తాగడం వల్ల బరువు పెరుగుతారు. అదే డైరెక్టుగా తినడం వల్ల ఆ సమస్య ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news