దేశం కోసం నా కుటుంబం రక్తం ధారబోసింది – ప్రియాంక గాంధీ

-

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పై ఆనర్హత వేటును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో సత్యాగ్రహం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో జరిగిన సత్యాగ్రహంలో రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బిజెపి సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

పార్లమెంట్ లో అదానీ గురించి ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని ఆరోపించారు. దేశం కోసం తన కుటుంబం రక్తం ధర పోసిందని చెప్పారు ప్రియాంక గాంధీ. దేశ భూమిలో, జెండాలో తన కుటుంబ రక్తం ఉందని తెలిపారు. దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబం సిగ్గుపడాలా? అని ప్రశ్నించారు. కుటుంబ రాజకీయాలు అంటూ తమను మాటిమాటికి బిజెపి అవమానిస్తుందని అన్నారు.

తన తల్లి సోనియా గాంధీని పార్లమెంటులో కూడా అవమానించారని అన్నారు ప్రియాంక గాంధీ. మమ్మల్ని అవమానించి, ఈడీ వంటి ఏజెన్సీ లతో బెదిరిస్తే మేం భయపడుతాం అనుకోవడం పొరపాటని అన్నారు. తాము భయపడే వాళ్ళం కాదని.. పోరాడుతామని అన్నారు. ఈ దేశ రాజకీయాల కోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news