Naga Chaitanya: చైతూ షాకింగ్‌ నిర్ణయం.. తొలిసారి స‌మంత బాట‌లో అలా..

-

Naga Chaitanya: స‌మంత‌తో విడాకుల అనంత‌రం నాగ చైత‌న్య ఓ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాడు. వెండి తెర మీద ఇంతవ‌ర‌కూ త‌న న‌ట‌న‌తో మెప్పించిన చైతూ.. ఓటీటీ వేదిక‌గా.. ప్రేక్ష‌కుల‌ను అల‌రించడానికి సిద్ధంగా ఉన్నాడ‌ట‌. ఇప్ప‌టికే ప‌లు హీరో, హీరోయిన్లు వీటిలో నటించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌కు అక్కినేని యంగ్‌ హీరో నాగచైతన్య శ్రీ‌కారం చుట్టుతున్నారు. అది కూడా స‌మంత లాగా.. వెబ్‌ సిరీస్ లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.

విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో న‌టించ‌డానికి ఓకే చెప్పాడ‌ట‌. ఈ వెబ్‌ సిరీస్‌ హర్రర్‌ కథాంశంతో వస్తున్నట్లు తెలిపాడు. ఈ వెబ్‌ సిరీస్‌లో నాగచైతన్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. నాగచైతన్య తన కెరీర్‌లో హర్రర్‌ కథలో నటిస్తుండడం ఇదేతొలిసారి కావడం విశేషం.

కరోనా వ్యాప్తితో థియేటర్లు మూతపడడం, ఈ స‌మ‌యంలో ఓటీటీ రంగం బాగా అభివృద్ది చెంద‌డంతో
న‌టులు కూడా చాలా ఆస‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో వెబ్‌ సెరీస్‌లు పెను సంచలనం సృష్టించాయి.
బడా నటీనటులు, బడా నిర్మాణ సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో వెబ్‌సిరీస్‌ల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే సమంత, తమన్నా వంటి స్టార్‌ హీరోయిన్‌లు ఇప్పటికే వెబ్‌ సిరీస్‌లలో నటించి మెప్పించారు. ఇప్పుడూ నాగచైతన్య కూడా ఓటీటీ లోకి అడుగుపెట్టాడు, అదికూడా నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఏ మేర‌కు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news