షాపింగ్ మాళ్లలో, ప్రైవేటు ప్లేసుల్లో మహిళలకు భద్రత లేకుండా ఉంది. తాజాగా హైదరాబాద్లో ఓ ప్రముఖ షాపింగ్ మాల్ లో మహిళా డ్రెస్ ట్రయల్ చేస్తున్న సమయంలో వీడియో తీయడానికి ప్రయత్నించారు పోకిరీలు. అయితే ఇలాంటి ఘటనే పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ కరాచీ నగరంలో జరిగింది. కరాచీ నఫూరా గోత్ ప్రాంతంలోని హరాక్స్ స్కూల్ లో ఈ ఘటన బయటపడింది. పాఠశాలతోని బాలికలు, బాలుర వాష్ రూముల్లో సీక్రెట్ కెమెరాలు బయపడ్డాయి. స్కూల్ లోని ఓ టీచర్ వీటిని గమనించి స్థానిక విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చాయి.
ఈ ఘటనపై విద్యాశాఖ సంబంధిత పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ ను షోకాజ్ నోటీసులను జారీ చేసింది. స్కూల్ వాష్ రూముల్లో వాషింగ్ బేషన్ వెనకాల షీట్ లో కెమెరాలను అమర్చారు. అయితే బాలురు, బాలికల కదలికను గమనించేందుకే కెమెరాలను ఏర్పాటు చేసినట్లు స్కూల్ యాజమాన్యం ఒప్పుకుంది. దీంతో అధికారులు సంబంధిత స్కూలు గుర్తింపును రద్దు చేశారు. రహస్య కెమెరాల ద్వారా రికార్డ్ చేయబడిన వీడియోల సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) సింధ్ సైబర్ క్రైమ్ జోన్ హెడ్ ఇమ్రాన్ రియాజ్ అక్కడి మీడియాతో చెప్పారు. కాగా ఈ అంశంపై విద్యాశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.