బాలయ్యని మళ్ళీ కెలికిన నాగబాబు..!

-

నందమూరి బాలకృష్ణ ని కెలకడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు మెగా బ్రదర్ నాగబాబు. అందుకే ఆయన చేసే ప్రతీ పనికి, ఆయన మాట్లాడే ప్రతీ మాటకి అందరికంటే ముందుగా రియాక్ట్ అవుతున్నారు నాగబాబు. మొన్న సినీ పెద్దలపై బాలకృష్ణ చేసిన విమర్శల మీద నాగబాబు ఘాటుగానే స్పందించారు. ఈ విషయం ఇప్పుడిప్పుడే చల్లారుతుంది అనుకునే లోపు తాజాగా మరోసారి బాలయ్యని కెలికేశాడు నాగబాబు.

తన పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య నిన్న ఓ పాట పడిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జగదేకవీరుని కథ సినిమాలో ఘంటసాల ఆలపించిన శివశంకరీ పాటను తన గాత్రంతో పాడాడు బాలయ్య. అయితే ఇప్పుడు ఈ పాటపై నాగబాబు స్పందించాడు. బాలయ్య పేరు వాడకుండా.. ఆయన పాడిన పాట ఊసెత్తకుండా కొన్ని పాటలు రీమిక్స్ కంటే ఒరిజినల్స్ బాగుంటాయంటూ బాంబ్ పేల్చాడు. “ఒక్కోసారి ఓల్డ్ సాంగ్స్ రీమిక్స్ కన్నా originals చాలా అద్భుతంగా ఉంటాయి.ఈ తరానికి ఘంటసాల గాత్ర మాధుర్యం విలువ ఈ పాటికె తెలిసుంటది”.. అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news