బ్రేకింగ్ : సీఎం జగన్ తో నాగార్జున భేటీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ము ఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున భేటీ కానున్నారు. మరీ కాసేపట్లోనే సీఎం జగన్ తో హీరో నాగార్జున బృందం భేటీ కానుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో సమావేశం కానుంది నాగార్జున బృందం.
క్యాబినెట్ సమావేశం అనంతరం నాగార్జున టీం తో భేటీ కానున్నారు సీఎం జగన్.

ఇందులో భాగం గానే ఇప్పటికే విజయవాడ కు చేరుకున్నారు నాగార్జున, మరో నలుగురు టాలీవుడ్ ప్రముఖులు. అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో అక్కినేని నాగార్జున బృందం ఎందుకు భేటీ అవుతుందని దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

థియేటర్ టికెట్ల ఆన్లైన్ విధానం మరియు చిత్రపరిశ్రమ సమస్యల పై … సీఎం జగన్ తో నాగార్జున బృందం చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. కరోనా కారణంగా నష్టపోయిన చిత్రపరిశ్రమకు ఆర్థిక సహాయం ఇవ్వాలని కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కోరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా థియేటర్ ఆన్లైన్ టికెట్ల విధానం కారణంగా జనసేన పార్టీ మరియు వైసీపీ పార్టీల మధ్య తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.