నన్ను క్షమించండి : హీరో నాగశౌర్య

-

టాలీవుడ్ లో హీరోగా ఇంకా గ్యారంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకునే హీరోలలో నాగశౌర్య ఒకరు. ఒక హిట్ పడితే.. వరుసగా ప్లాపుల బెడద.. కాగా నిన్ననే రంగబలి అన్న డిఫరెంట్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు,. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో సినిమా యూనిట్ అంతా ఆనందంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ అందరికీ క్షమాపణలు చెప్పాడు. ఎందుకు క్షమాపణలు చెప్పాడన్నది చూస్తే… రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో భాగంగా కొంచెం కొత్తగా ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్ లు ఇలా కొందరిని తీసుకుని వారిలా కమెడియన్ సత్యను నటింపచేసి హీరో నాగ శౌర్యను ఇంటర్వ్యూ చేయించారు, ఇది చూడడానికి ఫన్ గానే ఉన్నప్పటికీ కొందరికి ఇబ్బంది కలిగిందని చెప్పాలి. ఈ విషయాన్ని ఈ రోజు సక్సెస్ మీట్ లో మీడియా ప్రశ్నించగా.. ఇందుకు సమాధానంగా నాగశౌర్య మీడియా మేము వేరు కాదు ఇద్దరం ఒకటే ఫ్యామిలీ అంటూ చెప్పాడు.

అందరికీ తెలిసిన పాత్రలు హీరోను ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందా అని చేశాము.. ఎవ్వరినీ హేళన చేయాలనీ కాదు అంటూ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news