Nalgonda : తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నే తిరగనీయరా….?

-

నల్గొండ సభ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘నల్గొండ సభ ప్రకటించినప్పుడు కేసీఆర్ను తిరగనీయమని అన్నారు. అంత మొగోళ్లా? కేసీఆర్ను తిరగనీయరట! తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయరా? ఏం చేస్తారు.. చంపేస్తారా? కేసీఆర్ను చంపి మీరు ఉంటారా? ఇది పద్ధతా?. ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తుంది. మీకు ద‌మ్ముంటే మేం చేసిన దానికంటే మంచిగా చేసి చూపియ్ అని మండిపడ్డారు.

క‌రెంట్ మంచిగా ఇచ్చి చూపియ్.. ఆగ‌మాగం కావొద్దు అని అన్నారు. ఖ‌మ్మం జిల్లాలో సీతారామ పూర్తి చేయాలి. దాని గురించి ముచ్చ‌ట లేదు.పాల‌మూరు ఎత్తిపోత‌ల ఇంకా పూర్తి చేయాలి. దాని గురించి మాట‌లేదు. గురుకులాలు ఎక్కువ పెట్టాలి.. ఆ ముచ్చ‌ట‌ లేదు. క‌రెంట్ మంచిగా ఇవ్వాలి.. ఆ ముచ్చ‌ట లేదు. ఇవన్నీ మాయం చేసి బ‌లాదూర్‌గా తిరుగుదాం అనుకుంటున్నారా..? తిర‌గ‌నివ్వం జాగ్ర‌త్త అని చెబుతున్నాం. త‌ప్ప‌క నిల‌దీస్తాం. ఎండ‌గ‌డుతాం అని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news