మళ్లీ డబుల్ స్పీడ్‌తో అధికారంలోకి వస్తాం : కేసీఆర్

-

పదేళ్ల  బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని  మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. నల్గొండలో జరిగిన ఛలో నల్గొండ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేలా సంతకం పెట్టి వచ్చి ఇక్కడ నీతులు చెబుతున్నారని సీరియస్ అయ్యారు. అవగాహనతో మాజీ మంత్రి హరీశ్ రావు వెంటనే స్పందించి అసెంబ్లీలో గర్జించారని తెలిపారు. కేఆర్ఎంబీకి అప్పగించడమే కాకుండా నాలుగైదు రోజులు కాంగ్రెస్ మంత్రులు నాటకాలు ఆడారని పేర్కొన్నారు.

అసెంబ్లీలో బడ్జెట్ చాలా ముఖ్యమని.. బడ్జెట్ ను పక్కకు పెట్టి.. ప్రాజెక్టుల గురించి చర్చ పెట్టారని తెలిపారు. తాను నల్గొండ సభకు పిలుపునిచ్చాకే భయపడి సభలో హడావిడి తీర్మాణం చేశారని ఎద్దేవా చేశారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని.. తెలంగాణ హక్కులు, వాటాలు శాశ్వతం అని చెప్పారు కేసీఆర్. కాంగ్రెస్ కి దమ్ముంటే మాకంటే బాగా పని చేసి చూపించాలన్నారు. రాజకీయ విమర్శలకు దిగడం కరెక్ట్ కాదని.. మళ్లీ డబుల్ స్పీడ్‌తో అధికారంలోకి వస్తాం అని తెలిపారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news