ఆర్టీసీ వాటర్ బాటిల్‌కు పేరు పెట్టండి.. బహుమతి గెలుచుకోండి..!!

-

వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ టీఎస్ ఆర్టీసీ అందరి దృష్టిని తన వైపు లాగుతోంది. తాజాగా టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులు, బస్టాండ్‌ ఆవరణలో తాగునీటి వాటర్ బాటిల్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎండీ సజ్జనార్ శనివారం ఒక ప్రకటన చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో తీసుకొచ్చే వాటర్ బాటిల్ డిజైన్, ఒక బ్రాండ్ పేరును సూచించాలని ప్రయాణికులను కోరింది.

సజ్జనార్
సజ్జనార్

వాటర్ బాటిల్‌కు మంచి పేరు, డిజైన్ సూచించిన వారికి రివార్డులు కూడా ఇస్తామని ప్రకటించింది. కాగా, ప్రస్తుతం ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు వాటర్ బాటిళ్లు ఇస్తారు. అయితే బయట కంపెనీకి చెందిన వాటర్ బాటిళ్లు వాడుతారు. దీంతో బయటి కంపెనీలు కాకుండా శుభ్రమైన తాగునీటిని అందించే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని.. ఆర్టీసీ బ్రాండింగ్‌తో నీటి సౌకర్యాన్ని కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు ఆసక్తి కలిగిన వారు.. వాటర్ బాటిల్ డిజైన్, పేరును 9440970000 నంబర్‌కు వాట్సాప్ చేయాలని, లేదా.. @TSRTCHQ, #TSRTCompetition కు ట్విట్ చేయాలని ఎండీ సజ్జనార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news