ఇండస్ట్రీకి ఇంత మంది దర్శకులను పరిచయం చేసిన హీరో నందమూరి కల్యాణ్ రామ్..

-

నందమూరి కుటుంబం నుంచి వచ్చి హీరోగా తనను తాను నిరూపించుకున్న స్టార్ కల్యాణ్ రామ్. ఇటీవల ‘బింబిసార’ ఫిల్మ్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. పిక్చర్ లో ‘బింబిసారుడి’గా కల్యాణ్ రామ్ తన నటవిశ్వరూపం చూపించారు. ఇక ఇంతటి భారీ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కొత్త దర్శకుడికి ఇచ్చి కల్యాణ్ రామ్ సాహసమే చేశారని చెప్పొచ్చు.

నూతన దర్శకుడే అయినప్పటికీ కథ, కథనం పట్టుతో నడిపించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. కాగా, నందమూరి కల్యాణ్ రామ్ తన కెరీర్ లో ఇప్పటికే పలువురు నూతన దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ దర్శకులు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

‘బింబిసార’తో వశిష్ట అనే నూతన దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు కల్యాణ్ రామ్. ‘బింబిసార’కు సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే కల్యాణ్ రామ్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే సీక్వెల్ కోసం వశిష్ట స్టోరి రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ..ప్రస్తుతం ‘ఏజెంట్’ షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఆయనకు కూడా దర్శకుడిగా అవకాశం నందమూరి కల్యాణ్ రామే ఇచ్చారు.

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా రాజమౌళి తర్వాత ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి.. ఆయనకూ దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చింది నందమూరి కల్యాణ్ రామ్. ‘పటాస్’ సినిమా అనిల్ రావిపూడి తొలి పిక్చర్ కాగా ఇటీవల F3తో సూపర్ హిట్ అందుకున్నారు అనిల్.

‘అసాధ్యుడు’ అనే యాక్షన్ ఎంటర్ టైనర్ ద్వారా ఇండస్ట్రీకి అనిల్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేశారు నందమూరి కల్యాణ్ రామ్. అలా ప్రతిభ ఎక్కడున్నా కనిపెట్టి వారికి అవకాశం ఇవ్వడంలో ముందుంటున్నారు హీరో నందమూరి కల్యాణ్ రామ్.

Read more RELATED
Recommended to you

Latest news