‘వీ’ ట్రైలర్ : ఎలా ఫినిష్ చేద్దామంటున్న నాని..!

-

నేచురల్ స్టార్ నాని, యంగ్ స్టార్ సుధీర్‌బాబు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ‘వీ’ సినిమా ట్రైలర్ విడుదలైంది. అత్యంత ఉత్కంఠ‌ భరితంగా ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘ఎలా ఫినిష్ చేద్దాం’ అంటూ చెప్పే ఓ డైలాగును క్యాప్షన్‌గా పెట్టి నాని ట్విట్టర్ లో టీజర్‌ని విడుదల చేశాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు సమర్పణలో, ఇంద్రగంటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో సెప్టెంబర్‌ 5న విడుదల కానున్న విషయం తెలిసిందే. అలాగే నివేత థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటించారు.

ఈ చిత్రంతో నాని మొదటిసారిగా విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ రోల్ పోషిస్తున్నాడు. ఏ పని చేసినా సరే ఎంటర్‌టైనింగ్‌గా చేయాలనేది నా పాలసీ అంటూ నాని సీన్‌తో స్టార్ట్ చేసిన సన్నివేశాలను.. మళ్ళీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మ్యాచ్ అవలేదన్న మాట రాకూడదు అంటూ నాని చెప్పిన డైలాగుతోనే ముగిస్తూ ఈ ట్రైలర్ కట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news