టక్ జగదీశ్ ఫస్ట్ లుక్ తో నాని చెప్పాలనుకుంది ఇదేనా

-

టక్‌ చేసుకున్న ఆ కుర్రాడు… చూడ్డానికి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లా వున్నాడు. ఫుల్‌ హ్యాండ్స్‌ షర్ట్ వేసుకుని.. చాలా కామ్‌గా వున్నాడనుకుంటే పొరబాటే. సాఫ్ట్‌గా కనిపించినా.. చేసేవన్నీ హార్డ్‌వేర్‌ పనులే. ఫస్ట్‌ లుక్‌ వస్తేగానీ.. అతని క్యారెక్టర్‌ బైటపడలేదు. ఇంతకీ నేచురల్ స్టార్ ఫస్ట్ లుక్ తో ఏం చెప్పాలనుకున్నాడు..

నాని నటిస్తున్న సినిమా టక్‌ జగదీష్‌. సినిమా మొదలుకాకుండానే రిలీజైన ఫస్ట్ లుక్‌లో టచ్‌ సరిచేసుకుంటూ కనిపించాడు. టైటిల్‌కు జస్టిఫికేషన్‌ ఇచ్చాడనుకున్నారు. క్రిస్మస్‌నాడు రిలీజ్‌ చేసిన లుక్‌లో అదే టక్‌ కంటిన్యూ చేశాడు. భోజనం దగ్గర కూర్చుని వెనకాల నుంచి కత్తి తీసి షాక్‌ ఇచ్చాడు. సినిమా ఫ్యాక్షన్‌ కాన్సెప్టా? కామెడీనా అన్న సంగతి పక్కన పెడితే.. ఈలుక్‌ మాత్రం క్లాస్‌.. మాస్‌ అన్న తేడా లేకుండా… ఆకట్టుకుంది.

గతంలో నానితో నిన్నుకోరి తీసిన శివ నిర్వాణ ‘టక్ జగదీష్‌’ తీస్తున్నాడు. ఆతర్వాత నాగచైతన్యతో మజిలీ తీసి మరో హిట్‌ కొట్టాడు. దీంతో లవ్‌స్టోరీస్‌ స్పెషలిస్ట్‌గా పేరుతెచ్చుకున్న శివ నిర్వాణ టక్ జగదీష్‌తో రూటు మార్చినట్టు తెలుస్తోంది. టక్‌ జగదీష్‌ ఫస్ట్‌లుక్‌లో డైరెక్టర్‌ మార్క్‌ కనిపించకపోయినా.. డిఫరెంట్‌ రూటులో వెళ్తున్నాడనిపిస్తోంది.

టక్‌ జగదీష్‌ హిట్‌ నానీకి ఎంతో అవసరం. గత రెండు సినిమాలు గ్యాంగ్‌లీడర్‌.. వి బాక్సాఫీస్‌ను దోచుకోలేకపోయాయి. గతంలో ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి ఎంసిఎ వరకు 8 హిట్స్‌ కొట్టిన ట్రాక్‌ రికార్డ్‌ నానీ సొంతం. అయితే ఈ సక్సెస్‌కు కృష్ణార్జున యుద్ధం బ్రేకులేసింది. మధ్యలో జర్సీ మూవీతో ఓకె అనిపించుకున్నా… అదిరిపోయే హిట్‌ ఈ కుర్రహీరోకు దక్కలేదు. ఏప్రిల్లో రిలీజవుతున్న టక్‌ జగదీష్‌తో బాక్సాఫీస్‌ను మెప్పించాలనుకున్నాడు నేచురల్‌ స్టార్‌.

Read more RELATED
Recommended to you

Latest news