సౌత్‌ స్టార్స్‌ అందరినీ క్రాస్‌ చేసిన విజయ్ దేవరకొండ

Join Our Community
follow manalokam on social media

విజయ్ దేవరకొండ సౌత్‌లో సూపర్‌స్టార్‌గా ఎదగాలని చాలా ట్రై చేస్తున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ రేంజ్‌ బ్లాక్‌బస్టర్స్ మాత్రం రావట్లేదు. అయితే ఈ రేంజ్‌ సక్సెస్‌లేకపోయినా, సోషల్‌ మీడియాలో క్రేజీ రికార్డ్‌ సెట్‌ చేశాడు విజయ్. టాలీవుడ్‌ టాప్ హీరోలందరినీ వెనక్కి నెట్టి ఇన్‌స్టా స్టార్‌గా మారిపోయాడు రౌడీ.

Vijay Devarakonda
Vijay Devarakonda

విజయ్ దేవరకొండ కెరీర్ బిగినింగ్ నుంచే మార్కెట్‌ పెంచుకోవాలని ట్రై చేస్తున్నాడు. మల్టీలింగ్వల్స్‌తో స్టార్డమ్‌ విస్తరించే పనుల్లో ఉన్నాడు. కానీ విజయ్ చేసిన మల్టీలింగ్వల్స్‌లో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. తెలుగు, తమిళ్లో చేసిన బైలింగ్వల్‌ మూవీ ‘నోటా’ బాక్సాఫీస్‌ దగ్గర ఘోరంగా బోల్తాపడింది. ఆ తర్వాత దక్షిణాదిన నాలుగు భాషల్లో రిలీజ్‌ అయిన ‘డియర్ కామ్రేడ్’కి నెగటివ్‌ రిజల్ట్ వచ్చింది. ‘వరల్డ్‌ ఫేమస్ లవర్’కి హార్ట్‌ బ్రేక్ అయ్యింది. ఈ ఫ్లాపులతో విజయ్‌ మార్కెట్‌ చాలా డల్ అయ్యింది.

విజయ్ దేవరకొండకి వరుస ఫ్లాపులొస్తున్నా, క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. బోల్డ్‌ స్టేట్మెంట్స్‌తో హడావిడి చేసే విజయ్‌కి యూత్‌ ఫుల్లుగా కనెక్ట్ అవుతున్నారు. సోషల్‌ మీడియాలో అయితే విజయ్‌ని మిలియన్ల కొద్ది ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ ఫాలోవర్స్‌ 10 మిలియన్లకి చేరారు. సౌత్‌లో ఈ మార్క్‌ క్రాస్‌ చేసిన ఫస్ట్‌ హీరోగా నిలిచాడు విజయ్ దేవరకొండ.

టాలీవుడ్‌ టాప్‌ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్ అంతా విజయ్‌ కంటే వెనకాలే ఉన్నారు. పాన్ ఇండియన్‌ మూవీస్‌ చేస్తోన్న బాహుబలికి అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియన్ల ఫాలోవర్సే ఉన్నారు. ఇక అమ్మాయిల కలల రాజకుమారుడిగా చెప్పే మహేశ్‌బాబుకి 6.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సదరన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి 9.8 మిలియన్ ఫాలోవర్స్‌ ఉన్నారు. దీంతో విజయ్ దేవరకొండ బోల్డ్‌ స్పీచులు బాగానే వర్కవుట్ అవుతున్నాయని చెప్పుకుంటున్నారు సినీజనాలు.

విజయ్ దేవరకొండకి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్‌ ఉంది గానీ, కెరీర్‌ మాత్రం అంత గొప్పగా లేదు. వరుస ఫ్లాపులతో గ్రాఫ్ డౌన్ అవుతోంది. కంపల్సరీగా హిట్‌ కొడితేనే స్టార్డమ్‌ని కాపాడుకునే పరిస్థితులకి పడిపోయాడు. ఇలాంటి సిట్యువేషన్స్‌లో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియన్ మూవీ చేస్తున్నాడు విజయ్. మార్షల్‌ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్‌లో ‘ఫైటర్‌’ అనే సినిమా వస్తోంది. మరి ఈ మూవీతో విజయ్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడేమో చూడాలి.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...