హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్… వైసీపీ ప్రభుత్వం తీరు పై నిప్పులు చెరిగారు. ఆన్ లైన్ టికెట్ విధానాన్ని తీసుకుస్తున్న ఏపీ సర్కార్ పై మండిపడ్డారు పవన్ కళ్యాణ్. అంతేకాదు…హీరో నాని సినిమా టక్ జగదీష్ వివాదం పై కూడా పవన్ స్పందించారు.
ముఖ్యంగా సిని చిత్ర పరిశ్రమ ఒక్కటై… వైసీపీ సర్కార్ పై పోరాడాలని పిలుపునిచ్చారు. అయితే.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హీరో నాని తాజాగా స్పందించారు.
“‘చిత్ర పరిశ్రమ సంఘ సభ్యుడిగా ‘సీఎం జగన్ ను నేను వినయంగా అభ్యర్థిస్తున్నాను. సినిమా పరిశ్రమ తిరిగి పునరుజ్జీవనం పోసుకోవడానికి వైసీపీ సర్కార్ మరియు మంత్రులు కృషి చేయాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరియు ఏపీ ప్రభుత్వం మధ్య ఉన్న రాజకీయ విభేదాలను పక్కన పెట్టండి. చిత్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలి. పరిశ్రమ సమస్యలను పరిష్కరించడం ప్రస్తుతం అవసరం.” అంటూ ట్వీట్ చేశారు నాని. ప్రస్తుతం నాని చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Keeping aside the political differences between Pawan Kalyan sir and AP Government. The film industry issues addressed are genuine and needs immediate attention. Thank you @PawanKalyan sir.
— Nani (@NameisNani) September 26, 2021