జగన్ తెచ్చిన కొత్త పథకం ‘అంధకార ప్రదేశ్’ : లోకేశ్‌

-

యువగళం పేరిట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే.. నిడమర్రు మండలం మందలపర్రులో ఫ్లెక్సీల వివాదం నెలకొంది. దీంతో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీనిపై నారా లోకేశ్ స్పందించారు.

Lokesh: Case registered against Nara Lokesh.. because..

తన పాదయాత్రను ఒక్కరోజైనా అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. పాదయాత్ర దారిలో రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. తమ నాయకుడిని అవమానించేలా ఫ్లెక్సీలు పెడితే మాత్రం చింపేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. మీరు చేసిన అక్రమాలపై ఫ్లెక్సీలు పెట్టమంటారా… జగన్? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ తెచ్చిన కొత్త పథకం ‘అంధకార ప్రదేశ్’ అని ఎద్దేవా చేశారు. జగన్ ది 24 గంటల విద్యుత్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అని పేర్కొన్నారు. పోలవరం కుడి కాలువ మట్టి తవ్వి అమ్మేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news