రోడ్లు బాగయ్యేలా బటన్ నొక్కండి జగన్ : నారా లోకేశ్

-

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని రోడ్ల దౌర్భాగ్య పరిస్థితులను వివరిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నింటికీ బటన్‌ నొక్కుతున్న సీఎం జగన్‌ రాష్ట్రంలో అధ్వాన రహదారులు బాగయ్యేలా ఒక్కసారి బటన్‌ నొక్కాలని ఎద్దేవా చేశారు.

జగన్‌రెడ్డి సొంత జిల్లా కడపలో బి.మఠం మండలం సోమిరెడ్డిపల్లి పంచాయతీ వార్డు సభ్యుడు తమ గ్రామంలో రహదారులు వేయాలంటూ బురదలో పొర్లుదండాలు పెట్టారంటే…. ఏపీలో రహదారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ట్విటర్‌ వేదికగా శుక్రవారం మండిపడ్డారు. ‘

‘వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ కల్లా రహదారులపై గుంత కనపడకూడదంటూ మూడున్నరేళ్లుగా సీఎం జగన్‌ ఇచ్చే ప్రకటనల్లో ఒక్క అక్షరం మారలేదు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితీ మారలేదు. పొర్లుదండాల ఘటనను ప్రభుత్వంపై బురద జల్లే కుట్ర అని సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసినా ఆశ్చర్యపోనక్కల్లేదు. జగన్‌ రహదారులు బాగు చేయిస్తే గ్రామస్థులకు పొర్లుదండాలు పెట్టే బాధ తప్పుతుంది. నిరసన తెలిపిన వారిపై తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేయాల్సిన టాస్క్‌ సీఐడీకీ ఉండదు.’’ అని నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news