సీఎం జగన్‌కు సవాల్‌ విసిరిన లోకేశ్‌

-

ఏపీలో అధికార పార్టీ నేతలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటునే ఉన్నారు. అంతేకాకుండా ఛాలెంజ్‌లు చేసుకుంటూ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని ఏ2 సెలవిచ్చారని వెల్లడించారు.

Nara Lokesh: "ఇక పోటీ నుంచి తప్పుకుంటా".. మహానాడులో లోకేశ్ సంచలన ప్రకటన |  TDP leader Nara Lokesh sensational announcement in Mahanadu at Ongole | TV9  Telugu

స్పెషల్ స్టేటస్ సాధిస్తారని ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారని తెలిపారు. “ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కోసం మీరు పోరాడిందే నిజమైతే… ప్రత్యేక హోదా ప్రకటిస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటన చేయగలరా?” అని లోకేశ్ సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. మెడలు వంచుతారా? లేక కేసుల మాఫీ కోసం తల దించుతారా జగన్ రెడ్డి గారూ?” అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు లోకేశ్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news