నారా లోకేష్: మన ప్రభుత్వం రాగానే పన్నులు తగ్గిస్తాం

-

యువగళం పేరుతో ఏపీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ రోజు అనంతపురం జిల్లా ప్రతాడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు. ఈ పాదయాత్రలో లోకేష్ వద్దకు వచ్చిన ప్రజలు ధరలు బాగా పెరిగిపోయాయని … బ్రతుకు భారంగా మారుతోందని తమ భాధను మొరపెట్టుకున్నారు. ఇందుకు సమాధానంగా నారా లోకేష్ వారిని ఓదారుస్తూ ఇంకెన్ని రోజులు అమ్మా వచ్చే ఎన్నికలో మీరంతా టీడీపీకి ఓటు వేసి గెలిపించండి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వస్తువుల మీద పన్నులను తగ్గించి మీ భారాన్ని తగ్గిస్తాము అంటూ భరోసా ఇచ్చాడు.

ఇక్కడ పెన్షన్ లకు సంబంధించి కూడా లోకేష్ హామీ ఇవ్వడం విశేషం.. ఈయన మాట్లాడుతూ 6 లక్షల పెన్షన్ లను క్యాన్సిల్ చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని … ఒకవేళ అలా జరిగినా మేము వచ్చాకా అర్హులు అయిన అందరికీ పెన్షన్ లు అందిస్తామని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news