జగన్ ప్రభుత్వ అండదండలతోనే దళితులపై దమనకాండ : నారా లోకేష్

-

రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల ప్రోద్భలంతోనే దళితులపై వరుసగా దాడులు కొనసాగుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. అరాచకశక్తులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ అలసత్వమే దీనికి నిదర్శనమని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురంలో నిప్పుల కోటేశ్వరరావు కుటుంబంపై వైసీపీకి చెందిన ముత్తారెడ్డి దాడికి పాల్పడటం దారుణం అన్నారు. ఈ మేరకు లోకేష్ ఓ ప్రకటన విడుదల చేసారు.

- Advertisement -

కులం పేరుతో ముత్తారెడ్డి తనను దూషించాడని బాదితుడు కోటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దాడి తరువాత బాధిత కుటుంబానికి వైద్యం అందించేందుకు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిరాకరించడాన్ని గమనిస్తే జగన్ ప్రభుత్వ అండదండలతోనే దళితులపై దమనకాండ కొనసాగుతున్నట్టు స్పష్టం అవుతోంది. కంచికచర్లలో దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ పై మూత్రం పోసి అవమానించి చిత్ర హింసలకు గురి చేశారు.

ఈ ఘటనలో బాధ్యులపై బెయిల్ సెక్షన్ల కిందకేసులు నమోదు చేయడాన్ని చూస్తే దళితులపై జరుగుతున్నవన్నీ ప్రభుత్వ ప్రయోజిత దాడులేనని స్పష్టం అవుతోంది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అరాచకపర్వంపై కేంద్ర ప్రభుత్వం, జాతీయ మానక హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని వారికి రక్షణ కల్పించాలని లోకేష్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...