ఫలించిన బండి సంజయ్‌ కృషి.. త్వరలోనే ఎన్ హెచ్-563 విస్తరణ పనులు

-

ఈనెల 12న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎల్కతుర్తి-సిద్దిపేట-మెదక్(ఎన్ హెచ్-765డీజీ) జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గురువారం కరీంనగర్‌లో కేంద్ర రోడ్లు, రవాణా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జగిత్యాల-కరీంనగర్-వరంగల్ హైవే(ఎన్ హెచ్-563) విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. తెలంగాణలోని ఆయా జాతీయ రహదారుల విస్తరణ పనుల శంకుస్థాపన ఏర్పాట్ల తీరుతెన్నులపై కేంద్ర రోడ్లు, రవాణా శాఖ ప్రాంతీయ అధికారి కుష్వాహతో బండి సంజయ్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి-సిద్దిపేట-మెదక్(ఎన్ హెచ్-765డీజీ) జాతీయ రహదారి విస్తరణ పనుల శంకుస్థాపన ఏర్పాట్లతో పాటు జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి(ఎన్ హెచ్-563) విస్తరణ పనుల ప్రారంభం, భూ సేకరణ వంటి అంశాలపైనా అధికారులు సుధీర్ఘంగా చర్చించారు.

 

ఎన్ హెచ్-563 4 లేన్ విస్తరణ పనులకు సంబంధించి జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు మొత్తం 58.86 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం రూ. 2,151 కోట్ల 63 లక్షల అంచనా వ్యయం కానుందని అధికారులు బండి సంజయ్‌కు వివరించారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అలాగే కరీంనగర్ నుంచి వరంగల్ వరకు మొత్తం 68 కిలోమీటర్ల 4 లేన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నామని, దీనిక రూ.2,148 కోట్ల 86 లక్షల వ్యయం కానుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మొత్తంగా జగిత్యాల-కరీంనగర్-వరంగల్(ఎన్ హెచ్-563) విస్తరణ పనుల కోసం కేంద్రం రూ.4,300 కోట్ల 49 లక్షలు వెచ్చించనుంది. ఈ రహదారి విస్తరణ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ ముగిసిందని వెల్లడించిన అధికారులు అతిత్వరలోనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈనెల 12న ఎల్కతుర్తి-సిద్దిపేట-మెదక్(ఎన్ హెచ్-765డీజీ)తోపాటు బోధన్-బాసర-భైంసా, సిరోంచ-మహదేవ్ పూర్ శంకుస్థాపన పనులను కూడా రామగుండం నుంచి ఏకకాలంలో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బండి సంజయ్ తన ప్రోద్భలంతో రూ.1461 కోట్ల వ్యయంతో మంజూరైన ఎల్కతుర్తి-సిద్దిపేట-మెదక్ జాతీయ రహదారుల జాతీయ రహదారి విస్తరణ పనుల శంకుస్థాపన ఏర్పాట్లపైనా అధికారులతో ఆయన ప్రత్యేకంగా చర్చించారు. ప్రధాని రాక నేపథ్యంలో రహదారుల విస్తరణ పనుల శంకుస్థాపన విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను కోరారు. ఇదిలా ఉండగా గతంలోనూ కేంద్ర రోడ్డు, రవణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో బండి పలుమార్లు భేటీ అయి ఈ ప్రాజెక్టులు తీసుకురావడంతో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version