ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌పై ఎస్టీ కమిసన్ గరం.. గరం..

-

జాతీయ ఎస్టీ కమిషన్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. యాపల్ గూడ, రాంపూర్ గ్రామంలోని రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితుల కేసు జాతీయ ఎస్టీ కమిషన్ విచారించింది. ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎస్టీల భూమి సేకరిస్తుంటే ఏం చేశారని కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది జాతీయ ఎస్టీ కమిషన్. 107 ఎకరాల భూమిని తిరిగి భూ నిర్వాసితులకు ఎందుకు ఇవ్వకూడదో వివరణ ఇవ్వాలని కలెక్టర్ ను కమిషన్ ఆదేశించింది జాతీయ ఎస్టీ కమిషన్. భూమి ఇప్పించిన ఎమ్మెల్యే జోగు రామన్న, ఆర్డీఓ సూర్యనారాయణపై ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించింది జాతీయ ఎస్టీ కమిషన్.

ఈ కేసులో తదుపరి విచారణ నెల రోజులకు వాయిదా వేసింది జాతీయ ఎస్టీ కమిషన్. 2018లో ఉద్యోగాల ఇప్పిస్తామని చెప్పి రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం యాజమాన్యం భూమిని సేకరించింది. మూడేళ్లు పూర్తయినా సిమెంట్ ఫ్యాక్టరి ఏర్పాటు కాలేదని తెలిపింది. కాగా, వ్యవసాయ భూములు తిరిగి ఇవ్వాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.. భూ నిర్వాసితుల కోసం జాతీయ ఎస్టీ కమిషన్ లో సుహాసిని రెడ్డి పిటిషన్ వేసి పోరాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version