పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ తరుణంలోనే.. ఇవాళ కేంద్ర బడ్జెట్ పెట్టనుంది మోడీ సర్కార్. ఏడు సార్లు వరుసగా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డ్ ను సృష్టించనున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ఆర్ధిక మంత్రిగా వరుసగా 6 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు మురార్జీ దేశాయ్. 1959 నుంచి 1964 వరకు కేంద్ర ఆర్ధిక మంత్రిగా 6 ఏళ్ళు వరుసగా బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు మురార్జీ దేశాయ్.
అయితే, 5 సార్లు పూర్తి స్థాయు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టగా, ఒక్కసారి మాత్రం తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు మురార్జీ దేశాయ్. గతంలో ఏవిధంగా అయుతే, పూర్తి స్థాయు “పేపర్ లెస్” బడ్జెట్ లను ప్రవేశ పెట్టారో, ఈసారి కూడా అదే విధంగా “పేపర్ లెస్” బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. సార్వత్రిక ఎన్నికలున్నందున, ఈ ఏడాది ఫిబ్రవరి 1 వ తేదీన తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. కాగా, ఇవాళ్టి బడ్జెట్ లో ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా లబ్ధిదారులు, బీమా మొత్తం పెంపు, ఆదాయ పన్ను విషయంలో ఉపశమనాలు సహా సామాజిక, సంక్షేమ వ్యయాలను పెంచే అవకాశాలున్నట్లు సమాచారం.