జగదభిరాముడి చరిత్రను తెలిపేలా.. దేశంలో 290 చోట్ల ‘శ్రీరామ’ స్తంభాల నిర్మాణం

-

శ్రీరాముడి జీవిత చరిత్రతో పాటు ఆయన ప్రాముఖ్యతను రాబోయే తరాలకు తెలియజేసేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్య రామమందిరానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. దేశంలోని 290 ప్రాంతాల్లో శ్రీరాముడి రాతి స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వ్యయాన్ని అశోక్ సింఘాల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ భరిస్తుందని వెల్లడించారు. వీటి నిర్మాణంలో ప్రభుత్వానికి చెందిన ఒక్క రూపాయిని కూడా వాడబోమని స్పష్టం చేశారు.

ఈ స్తంభాల ద్వారా శ్రీరాముడి చరిత్రతోపాటు ఆయన ప్రాముఖ్యత రానున్న తరాలకు తెలుస్తుందని చంపత్ రాయ్ అన్నారు. వీటిని ఏర్పాటు చేసే స్థలానికి సంబంధించి వాల్మీకి రామాయణంలో ఉన్న స్థల పురాణం లాంటి వివరాలను కూడా స్థానిక భాషలోనే అందరికీ అర్థమయ్యే విధంగా ఉండేలా చూస్తామని వెల్లడించారు. అశోక్ సింఘాల్ ఫౌండేషన్ పేరుతో దిల్లీలో ఉన్న ఓ ట్రస్ట్ … శ్రీరాముడి జీవితం, ఆయన విశిష్టతను భావితరాలకు తెలియజేసేలా వాటి వివరాలను రాతి స్తంభాలపై చెక్కి దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో స్థాపించాలని నిర్ణయించినట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version