బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించిన అగంతకుడు

-

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసం లోకి అర్ధరాత్రి ప్రవేశించాడు ఓ ఆగంతకుడు. గుర్తు తెలియని ఆ వ్యక్తిని సీఎం నివాసం ఆవరణలో చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే కోల్ కతా లాల్ బజార్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ అనుకొని తాను సీఎం నివాసంలోకి ప్రవేశించినట్లు నిందితుడు తెలిపాడు. కానీ అర్ధరాత్రి సమయంలో పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏం పని అని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

అర్ధరాత్రి సీఎం నివాసం లోకి అక్రమంగా చొరబడినందుకు హఫీజుల్ మొల్లా పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి వయసు 30 ఏళ్లకు పైగా ఉంటుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:20 గంటల సమయంలో కాళీఘాట్ ప్రాంతంలోని హరీష్ చటర్జీ వీధి 34 బిలో గోడదూకి మమతా బెనర్జీ నివాసం లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. పటిష్ట భద్రత ఉన్నా ఎవరి కంటా పడకుండా లోనికి ఎలా వెళ్లాడు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news