త్రిపురలో స్వైన్ ఫివర్ కలకలం…. పందులను చంపేయాలని ఆదేశం

-

కరోనా, బర్డ్ ప్లూ ఇలా ఒక్కో వైరస్ విరుచుకుపడుతోంది. గత రెండేళ్ల నుంచి కరోనా బారిన పడి ప్రపంచం విలవిల్లాడుతోంది. తాజాగా అస్సాంలో బర్డ్ ఫ్లూ వ్యాధిని కనుకున్నారు. ఇప్పుడు త్రిపురాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. త్రిపురలోని సెపాహిజాలా జిల్లా పరిధిలోని దేవి పూర్ లో ఉన్న పిగ్ బ్రీడింగ్ ఫామ్ లో ముందుగా ఈ వైరస్ ను కనుకున్నారు అధికారులు. మొత్తం 63 పందిపిల్లలు రోగలక్షణాలతో మరణించడంతో వాటి శాంపిళ్లను నార్త్ ఈస్టర్న్ రీజినల్ డిసీజ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీకి పంపారు. దీంట్లో స్వైన్ ఫీవర్ గా తేలింది. భోపాల్‌లోని నేషనల్ డిసీజ్ డయాగ్నస్టిక్ ఇన్‌స్టిట్యూట్ పరీక్ష ఫలితాలు కూడా రావాల్సి ఉన్నాయి. సైన్ ఫీవర్ కారణంగా అధికారులు అప్రమత్తం అయ్యారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీం లను త్రిపుర సర్కార్ ఏర్పాటు చేసింది. పిగ్ ఫార్మ్ లో పని చేసే వారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

 

.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version