చట్టం ముందు అందరూ సమానమే.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

-

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం కి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే అని పేర్కొంది కోర్టు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఏమి ఉండవు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పాల్సిన అవసరం లేదు. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఢిల్లీ హై కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ.. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది హై కోర్టు. రిమాండ్ ను చట్టవిరుద్ధంగా పరిగణించలేమంది కోర్టు. ఈడీ అరెస్ట్ చేయడాన్ని సమర్థించింది. వారి వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. కేజ్రీవాల్ సహకరించకపోవడం జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న వారిపై ప్రభావం చూపిందని తెలిపింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news