నీట్ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో తీవ్ర గందరగోళం మధ్య లోక్‌సభ జులై 1కి వాయిదా పడింది. విపక్షాలు ఏ అంశం లేవనెత్తినా సమగ్ర సమాచారం ఇస్తామని తాము స్పష్టంగా చెప్పినా విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుపడటం విచారకరమని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధమని తాము సభ్యులకు మరోసారి హామీ ఇస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వం పదేపదే చెప్పినా సభా కార్యకలపాలకు కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడుతూ సభను సజావుగా జరగనివ్వకపోవడం సరైంది కాదని, దీన్ని తాను ఖండిస్తున్నానని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగలవద్దని ఆయా సభ్యులకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి చెప్పారు. మరోవైపు ఈ నీట్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ తప్పుపట్టారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్‌తో లక్షలాది విద్యార్ధులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విపక్ష ఇండియా కూటమి సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారని, ఇక తాను క్రిమినల్ చట్టాల అమలు నిలిపివేయాలని కోరుతూ నోటీస్ ఇచ్చానని మనీష్ తివారీ పేర్కొన్నారు.