ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన ప్రజస్వామ్య వ్యవస్థ భారతదేశానికే సొంతం. ఇప్పటికే భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రపంచ దేశాలు ఎన్నోసార్లు ప్రశంసలు కురిపించాయి. అగ్రరాజ్యం కూడా ఉందుకు మినహాయింపే కాదు. తాజాగా మరోసారి భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై అమెరికా ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. భారత్‌లో చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం ఉందని తెలిపింది. ఎవరైనా దిల్లీకి వెళ్తే దానిని చూడవచ్చని వివరించింది.
భారత్‌లో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం ఉందా అనేప్రశ్నకు అమెరికా ప్రభుత్వ ప్రతినిథి జాన్ కిర్బీ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న వేళ… భారత్‌తో మరింత లోతైన, బలమైన స్నేహబంధాన్ని నెలకొల్పతామని చెప్పారు. అనేక స్థాయిల్లో అమెరికాకు భారత్ బలమైన భాగస్వామి అని వివరించారు. రక్షణమంత్రి ఆస్టిన్ భారత పర్యటనలో అనదపు సహకారం ప్రకటించారని చెప్పిన కిర్బీ…. ఇరుదేశాల మధ్య భారీగా వాణిజ్యం కూడా జరుగుతోందని తెలిపారు. పసిఫిక్ క్వాడ్‌లో….. భారత్ ముఖ్యమైన స్నేహితుడని చెప్పారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో….. ఈ సహాకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అధ్యక్షుడు బైడెన్ సిద్ధంగా ఉన్నారని కిర్బీ వివరించారు.