సిక్కుల భేటీ అమృత్​పాల్​కు పిలుపు.. పంజాబ్ పోలీసుల సెలవులు రద్దు

-

గత కొద్ది రోజులుగా ఖలీస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ పంజాబ్ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. రకరకాల వేషధారణలో ఇప్పటికే పలుమార్లు పోలీసులకు మస్కా కొట్టి త్రుటిలో పరారవుతున్నాడు. అయితే ఈ మధ్య అమృత్ పాల్ పోలీసులకు లొంగిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఖండిస్తూ తాను లొంగిపోవడానికి రెడీగా లేనంటూ అమృత్ పాల్ ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు.

అయితే తాజాగా అమృత్​పాల్ సింగ్ సిక్కులతో భారీ సమావేశానికి పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈనెల 14వ తేదీ వరకు ఆ రాష్ట్ర పోలీసులకు సెలవులు రద్దు చేస్తూ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. గ‌త కొన్ని రోజుల నుంచి అమృత్‌పాల్ ప‌రారీలో ఉన్న విష‌యం తెలిసిందే. సిక్కు మ‌త‌స్తుల సంఘం అకాల్ త‌క్త్ భారీ స‌భ‌ను ఏర్పాటు చేయ‌నుంది. ఏప్రిల్ 14వ తేదీన బైసాకీ ప‌ర్వ‌దినం నేప‌థ్యంలో ఈ మీటింగ్‌ను నిర్వ‌హించాల‌నుకుంటున్నారు. అయితే అప్ప‌టి వ‌ర‌కు పోలీసులకు లీవ్స్ రద్దు చేస్తూ పంజాబ్ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news