సామాన్యులకు మరో షాక్. వారంలోనే పెరిగిన బియ్యం ధరలు.. ఇంకా పెరిగే అవకాశం.. కారణం ఇదే..!

-

ఇప్పటికే డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌,  పాలు ఇలా నిత్యవసర ధరలు అన్నీ పెరుగుకుంటూ పోతున్నాయి.. నేను ఏమన్నా తక్కవా అన్నట్లు మరో వారం రోజుల్లో బియ్యం ధరలు కూడా కొండెక్కపోతున్నాయట. సామాన్యులకు ఇది షాకింగ్‌ న్యూసే.! ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇండియాలో కొంతకాలంగా కొన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంతో నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రధానంగా ఇంధనాలు, గోధుమల ధరలు పెరిగాయి. ఇప్పుడు బియ్యం కూడా ఆ జాబితాలో చేరింది.
పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ బియ్యంపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో ఇండియాలో బియ్యం ధరలకు రెక్కలు వచ్చినట్లు అయింది.. మన దేశంలో వారంలోనే బియ్యం ధరలు 5 శాతం వరకు పెరిగాయి.
చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా ఇండియా ఉంది. ప్రపంచంలో 40 శాతం వరి ఇక్కడే సాగవుతుంది. ఈ ఏడాది డిమాండ్‌ పెరగడం, వరి సాగు కూడా తగ్గడంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. సెప్టెంబర్ 2 నాటికి వరి సాగు విస్తీర్ణం 5.6 శాతం తగ్గి 383.99 లక్షల హెక్టార్లకు చేరుకొంది. గతేడాది 406.89 లక్షల హెక్టార్లలో వరి సాగైంది.
పెరుగుతున్న డిమాండ్‌-  బియ్యం ఎగుమతులకు పరిస్థితులు అనుకూలంగా మారడంతో భారతదేశంలో ఒక్కసారిగా ధరలు పెరుగుతున్నాయి. ET నివేదిక ప్రకారం.. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ బియ్యంపై దిగుమతి సుంకాన్ని 25 శాతం నుంచి 15.25 శాతానికి తగ్గించింది. దీంతో గత వారంలో భారతదేశంలో బియ్యం ధరలు సుమారు 5 శాతం పెరిగాయి. దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల బంగ్లాదేశ్ నుంచి బియ్యం డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు.
ఈ పరిస్థితులపై రైస్‌ విల్లా సీఈవో సూరజ్‌ అగర్వాల్‌. బంగ్లాదేశ్ ప్రభుత్వం బియ్యం దిగుమతిపై సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఇండియాలో ధరలు అకస్మాత్తుగా 4 శాతం వరకు పెరిగాయని చెప్పారు. భారతదేశం నుంచి బంగ్లాదేశ్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తుందని, వియత్నాం నుంచి కూడా కొనుగోలు చేస్తుందని సూరజ్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, బిహార్‌ నుంచి బియ్యం బంగ్లాదేశ్‌కు ఎగుమతి అవుతున్నాయి. బంగ్లాదేశ్‌ ఎక్కువగా సాంబా మసూరి, సోనం, కోలం రకాల బియ్యాన్ని దిగుమతి చేసుకుంటుంది. గడిచిన వారంలో ఈ రకాల ధరలు 3- 4 శాతం పెరిగాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బంగ్లాదేశ్‌కు సమీపంలోనే ఉంటుంది. ఈ రాష్ట్రం నుంచి ఎక్కువగా మినీకేట్ బియ్యం ఎగుమతి అవుతాయి. బంగ్లాదేశ్‌లో పెరిగిన డిమాండ్‌తో మినీకేట్‌ ధరలు పశ్చిమ బెంగాల్‌లో 5 శాతం పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news