మమతా బెనర్జీ సమావేశానికి ఆహ్వానించినా మేము వెళ్ళం: అసదుద్దీన్ ఓవైసీ

-

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో విపక్ష నేతలతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మమతా సమావేశానికి తనను ఆహ్వానించలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఒకవేళ తనకు ఆహ్వానం అందినా.. ఆ సమావేశానికి తాను హాజరయ్యే వాడిని కాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి ఒక కారణమని అన్నారు. కాంగ్రెస్ ను ఆహ్వానించారు కాబట్టి.. ఆ సమావేశానికి తాము వెళ్ళమని చెప్పారు.

మమత పార్టీ టిఎంసి తమ పార్టీ గురించి చాలా దారుణంగా మాట్లాడిందని.. అలాంటప్పుడు వారి పార్టీ సమావేశానికి ఎలా హాజరవుతానని ఓవైసీ అన్నారు. మొత్తం 19 రాజకీయ పార్టీల నేతల సమావేశానికి మమతా ఆహ్వానించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను ఆహ్వానించక పోవడం గమనార్హం. మరో వైపు ఈ సమావేశానికి కేసీఆర్, కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news