ఒడిస్సా రైలు ప్రమాదం పై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన

-

 

 

 

ఒడిస్సా రైలు ప్రమాదం పై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.ఒడిశా రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు రైల్వే శాఖ ఆదేశించింది. ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మృతి చెందగా, ప్రమాద స్థలాన్ని పరిశీలిoచారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.

ప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్న కేంద్ర మంత్రి.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు అశ్విని వైష్ణవ్. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరం అన్నారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.. దర్యాప్తు హైలెవెల్‌ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యల మీదే ఫోకస్ పెట్టాం.. విచారణ తర్వాతే ప్రమాదానికి కారణాలు చెప్పగలం అని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version