భారత్‌తో బంగ్లాదేశ్‌ సై..అంతర్జాతీయ సంస్థ షాకింగ్‌ వివరాలు

-

ఈ ఏడాది భారత్‌తో బంగ్గాదేశ్ పోటీ పడుతుంది..అన్ని కలిసి వస్తే ఇండియాను వెనక్కి నెట్టెందుకు విశ్వప్రయాత్నలు చేస్తుంది..చరిత్ర ఎన్నడు లేనంతగా ఇప్పడు బంగ్లాదేశ్ భారత్‌ను ఎందులో టార్గెట్ చేసింది?,అంతర్జాతీయా సంస్థ భారత్‌ను ఎందుకు హెచ్చరించింది?..వివరాల్లోకి వెలితే జీడీపీ పరంగా ఈ ఏడాది భారత్‌ను బంగ్లాదేశ్‌ దాటనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ షాకింగ్ వివరాలు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 10.3 శాతానికి తగ్గిపోనుందని తెలిపింది. వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ ఐఎంఎఫ్ ఈ నివేదికను విడుదల చేసింది. 2021 మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి భారత తలసరి స్థూల జాతీయోత్పత్తి10.3 శాతం తగ్గి 18 వందల 77 డాలర్లకు చేరుకోనుందని ఐఎంఎఫ్‌ తన నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో బంగ్లాదేశ్ తలసరి జీడీపీ 18వందల 88 డాలర్లకు పెరుగుతుందని ఆ నివేదిక పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధి రేటు 4.5 శాతం తగ్గిపోనుందని జూన్‌లో వెలువరించిన అంచనాల్లో పేర్కొనగా.. తాజాగా దాన్ని మరింత తగ్గించింది.

Read more RELATED
Recommended to you

Latest news