రోజురోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడుతోంది. ఈ ట్రాఫిక్ జామ్ సమస్యకు చెక్ పెట్టడానికి మెట్రో నగరాల్లో మెట్రో రైల్వే సర్వీసులు నడుపుతున్నారు. చాలా మంది ప్రయాణికులు సొంత వాహనాలున్నా సరే ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి.. టైం ఆదా అవుతుందని మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినప్పుడు.. తప్పదు అనిపిస్తే ఇక మెట్రో వైపు పరుగులు పెడతున్నారు. బెంగళూరులో ఓ పెళ్లి కూతురు కూడా ఇలానే చేసింది.
కల్యాణ మండపానికి కారులో బయలుదేరిన ఓ వధువు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ముహూర్తం సమయానికి కల్యాణ వేదిక వద్దకు చేరుకోవాలని ఆమె వెంటనే మెట్రో రైలును ఆశ్రయించారు. పెళ్లి కుమార్తె ముస్తాబులో ఉన్న ఆ యువతి మెట్రోలో ప్రయాణిస్తుండగా ఓ ఔత్సాహికుడు వీడియో తీసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు.
అంతే.. కర్ణాటకలో ఆ వీడియో వైరల్‌గా మారింది. ‘వాట్ ఏ బ్రైడ్’ పేరిట పెట్టిన వీడియోను కొద్ది గంటల్లోనే 8వేల మంది వీక్షించారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని నెటిజన్లు స్పందిస్తున్నారు.
Whatte STAR!! Stuck in Heavy Traffic, Smart Bengaluru Bride ditches her Car, & takes Metro to reach Wedding Hall just before her marriage muhoortha time!! @peakbengaluru moment 🔥🔥🔥 pic.twitter.com/LsZ3ROV86H
— Forever Bengaluru 💛❤️ (@ForeverBLRU) January 16, 2023