బండి సంజయ్ ప్రచారం చేసిన చోట్లల్లో బీజేపీకి 3, 5 స్థానాలు !

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌ కి బిగ్‌ షాక్‌ తగిలింది. బండి సంజయ్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో బీజేపీకి 3వ, 5వ స్థానాల్లో ఘోర పరాభవం ఎదురైంది. కర్ణాటక ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం చేసిన చింతామణి, ముల్బగల్, బాగేపల్లి, గౌరీబిదనూర్, చిక్కబల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ఘోర పరాభవం దిశగా కొనసాగుతుంది.

గౌరీబిదనూర్ బీజేపీ 5వ స్థానం, చింతామణిలో బీజేపీ 3వ స్థానం, ముల్బగల్ బీజేపీ 3వ స్థానం, బాగేపల్లి బీజేపీ ఓటమి దిశగా, చిక్కబల్లాపూర్ బీజేపీ ఓటమి దిశగా ఉంది. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విజయం సాధించారు. కనకపుర నియోజక వర్గంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విజయం సాధించారు. దీంతో ఇప్పటి వరకు నాలుగో సారి కనకపుర నియోజక వర్గంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విజయం సాధించినట్లైయింది.

Read more RELATED
Recommended to you

Latest news