వీడియోకాన్‌ ఛైర్మన్‌ రిట్‌ పిటిషన్‌.. తీర్పును రిజర్వ్‌లో పెట్టిన బాంబే హైకోర్టు

-

వీడియోకాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ లోన్‌ ఫ్రాడ్‌ కేసులో వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. సీబీఐ తనను అరెస్ట్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ వేణుగోపాల్‌ ధూత్‌ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును వెల్లడి చేయకుండా రిజర్వ్‌లో పెట్టింది.

చందాకొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవోగా ఉన్న సమయంలో వీడియోకాన్ కంపెనీ దాదాపు రూ.2 వేల కోట్ల లోన్‌ తీసుకుంది. ఆ లోన్‌ మంజూరులో అవినీతి చోటుచేసుకుందంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. లోన్‌ మంజూరు చేసిన చందాకొచ్చర్‌ను, తీసుకున్న వీడియోకాన్‌ చైర్మన్‌ను, డీల్‌ నడిపించిన చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news