బంపర్ ఆఫర్.. ఖాళీ పాల ప్యాకెట్లు ఇస్తే పెట్రోల్ పై డిస్కౌంట్

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న సంగతి తెలిసిందే. దీంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అయితే దేశమంతా పెట్రోల్ రేట్లు ఒకలా ఉంటే.. రాజస్థాన్ బిల్వారాకు చెందిన పెట్రోల్ బంక్ లో మాత్రం పెట్రోల్ పై రూ. 1, డీజిల్ పై 50 పైసలు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా? రెండు బంకుల మధ్య పోటీనొ.. లేక వాహనదారులను ఆకట్టుకునేందుకు పెట్రోల్ పై డిస్కౌంట్లు ఇస్తున్నారు అని అనుకోకండి.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాజస్థాన్ భిల్వారా కు చెందిన పెట్రోల్ బంకు యాజమాని అశోక్ ముంద్రా ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అది కూడా ఖాళీ లీటర్ పాల ప్యాకెట్లు ఒకటి లేదా.. ఆఫ్ లీటర్ ప్యాకెట్లు రెండు. ఇవేకాక లీటర్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకు వస్తే లీటర్ పెట్రోల్ పై రూ.1 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ ఆరు నెలల వరకు కొనసాగుతుందని తెలిపారు అశోక్ ముంద్రా. ఈ ఇష్యు ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.